క్షీరాబ్ధి ద్వాదశి పూజ
క్షీరాబ్ధి ద్వాదశి పూజ – క్షీరాబ్ధిశయన వ్రతం – కార్తీక శుద్ధ ద్వాదశీ వ్రతం ఆషాడ మాస శుక్లపక్ష ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీమహావిష్ణువు కార్తీక శుక్ల ఏకాదశి నాడు(ఉత్థాన ఏకాదశి) మేల్కొంటాడని పురాణాలు వచనం. ఉత్థాన ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొని బ్రహ్మతో కలసి తన ప్రియురాలైన తులసి ఉండే బృందావనంలోకి ద్వాదశి నాడు ప్రవేశిస్తాడు కనుక కార్తీక శుద్ధ ద్వాదశీ రోజున క్షీరాబ్ధిశయన వ్రతాన్ని ఆచరించి తులసిని, విష్ణువునూ పూజించి దీపారాధన చేసినయెడల దీర్ఘసౌమంళిత్వం ప్రాప్తించి సుఖసంపదలు, ఐశ్వరం కలుగుతాయని స్మృతికౌస్తుభం పేర్కొన్నది. క్షీరాబ్ధి ద్వాదశి పూజ లేదా క్షీరాబ్ధిశయన వ్రతం లేదా కార్తీక శుద్ధ ద్వాదశీ వ్రత విధానం, ఏవిధంగా జరుపుకోవాలో మంత్ర పూర్వకంగా, వివరణతో క్రింది విధంగా తెలుపబడినది. శ్రీ పసుపు గణపతి పూజ: శ్లో || శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే (దీపము వెలిగించి దీపపు కుందెకు గంధము,కుంకుమబ...