ఉదయ కుంకుమ నోము
ఉదయ కుంకుమ నోము
చాలా ప్రాచీన కాలపు మాట. ఆ కాలంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు వివాహమైనది. ఆ బ్రాహ్మణుడికి నలుగురు కుమార్తెలు ఉండేవారు. ఆ బ్రాహ్మణుడు ముగ్గురు ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయగా వారి భర్తలు చనిపోయి వాళ్ళు విధవరాళ్ళు అయ్యారు. కుమార్తెలను చూసి ఆ బ్రాహ్మణ దంపతులు బాధపడుతూ ఉండేవారు. ఈ లోపల చిన్న కుమార్తె యుక్తవయస్కురాలు అయింది. ఆమెకు వివాహం చేయాలని ఉన్నా ఆ పిల్ల అక్కలకు ప్రాప్తించిన వైధవ్యం ఈమెకు కూడా వైధవ్యం పోతుందేమో అని బాధపడుతూ ఉండేవాళ్ళు. ఏమిటి ఈ కర్మ ముగ్గురు కుమార్తెలు వైధవ్యం అనుభవిస్తున్నారు వారి పసుపు కుంకుమలు పోయాయి.కనీసం ఈమె మాంగల్యం అయినా కాపాడు అని ఆ బ్రాహ్మణుడు నిరంతరం భగవంతుడిని తలచుకుంటూ ఈ బిడ్డను అయినా సుమంగళిగా ఉంచమని మొరపెట్టుకునేవాడు. ఒకరోజు పరమేశ్వరుడు ఒక సాధురూపాన వారింటికి వచ్చి ఓ బ్రాహ్మణా దంపతులారా మీ విచారానికి కారణం నాకు తెలుసు భాధ పడకండి. మీ కుమార్తె చేత ఉదయ కుంకుమ నోము నోయించండి ఆమె మాంగళ్యంనిలిచి పసుపు కుంకుమలతో సుఖంగా జీవిస్తుంది అని చెప్పిఅంతర్ధాన మయ్యాడు. .సాధువు మాటలలో నమ్మకం కలిగి అలా చేయడం వలన తమ కుమార్తెకు వైధవ్యం తొలగిపోతుండానే నమ్మకం కలిగిన ఆ దంపతులు తమ ఆఖరి కుమార్తె చేత ఉదయ కుంకుమ నోమును నోయించారు. వ్రత ప్రభావం వలన ఆమెకు పూర్ణాయుష్కుడైన, అందమైనవాడు భర్తగా లభించాడు. జీవితాంతం సుఖంగా ముత్తయిదువుగా జీవించింది.ఈ ఉదయ కుంకుమ నోముని నోచుకుని గౌరీదేవిని ధూపదీప నైవేద్యాలతో పూజించిన వారికి మాంగళ్యం, సిరిసంపదలు ప్రాప్తిస్తాయి.
ఉద్యాపన.
సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని, స్నానం చేసి బొట్టూకాటుక పెట్టుకుని గౌరీదేవికి నమస్కరించాలి.పూజ చేయాలి. ఆలా ఒక సంవత్సరం పాటుచేయాలి.సంవత్సరం పూర్తయిన తరువాత ఒక ముత్తైదువకు పసుపు పువ్వులు, రవికెల గుడ్డ, దక్షిణ తాంబూలం ఇచ్చి, భోజనం పెట్టి ఆమె ఆశీస్సులు పొందాలి.నియమ నిష్టలతో వ్రతం చేయాలి. నమ్మకం ఉండాలి. చిత్త శుద్ధితో చేయాలి.తప్పక ఫలితం కలుగును. ఆ చల్లనితల్లిని నమ్మితే ఆ తల్లి తప్పక మనల్ని కాపాడుతుంది.త్రికరణ శుద్ధిగా నోమును ఆచరించి తల్లి దయకు పాత్రులు కండి .
ఈ ఉదయ కుంకుమ నోము కన్నెపిల్లలు చేసుకుని తీరవలసిన నోము.
>>>>> >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
Comments
Post a Comment
thanking you comment visit our website
https://kbsastrology.com/