పసుపు - కుంకుమల నోము.

పసుపు - కుంకుమల నోము. పూర్వకాలంనాటి మాట. ఆ కాలమున ఒక గ్రామాన ఒక ధనవంతుడైన కోమటి ఉండేవాడు. ఆయనకు ఒక కుమార్తె కలిగినది. పెరిగి పెద్దదైనది. ఆమెను వారి కులస్తుడగు ఒక వరునికిచ్చి వివాహం చేసాడు. వివాహమైన కొన్నాళ్ళకు ఆమె భర్త స్థిరత్వం లేక అస్థిరుడై, చంచలుడై ఇంటిపట్టున ఉండక దేశ దిమ్మరిలా తిరుగుతూ ఉండేవాడు. అందుకు అతని భార్య పాపం చాలా బాధపడుతూ ఉండేది. గౌరిశంకరులను ప్రార్ధించి, అది దంపతులారా! నా కష్టం గట్టెక్కే మార్గమే లేదా? అని వినయంగా అడిగింది. ఒకనాడు శివుడు కలలో కనిపించి - పిచ్చిదానా! అధైర్యపడకు. ధైర్యంగా ఉండు. తప్పక కాలం కలసివస్తుంది. పసుపు - కుంకుమల నోము నోచుకో, అని వివరాలు చెప్పి అదృశ్యమయ్యాడు శంకరుడు. పరమేశ్వరుడు చెప్పిన విధంగా ఆమె ప్రాతఃకాలాన లేచి స్నానంచేసి 5 కుంచముల పసుపు, 5 కుంచముల కుంకుమ సిద్ధం చేసుకుని ముత్తయిదువులకు పంచింది. పంచె సమయాన మౌన ధారణ (మాట్లాడకుండా ఇవ్వడం ) ముఖ్యం. పంపకం పూర్తికాగానే గౌరీ దేవికి కుంకుమ పూజ చేయించి అన్నదానం చేయించింది. తానూ తిన్నది. వ్రత ప్రభావం. తెల్లవారేసరికి ఆమె కెదురుగా ఆమె భర్త నిలబడి ఉన్నాడు. మందహాసం చేస్తూ పరమ శాంతంగా నిలబడ్డాడు. ఆశ్చర్యం, వింత , విస్మయం,కలిగి ఆమె ఇది కలా? నిజమా? ఈ వ్రతమందు ఇంత అద్భుత శక్తి ఉందా? అనుకొంటూ ప్రతి ఏటా చేసేది. హాయిగా భర్తతో జీవించింది. ఇహమందు సుఖపడి పరమందు మోక్షం పొందింది. అందరూ ఈ నోము నోచవచ్చు, ఆచరించవచ్చు. ఫలం పొందవచ్చు. భక్తిశ్రద్ధలు అవసరం. నమ్మకం ముఖ్యం. విశ్వాసం ప్రధానం. నాస్తికులు చేసిన ఫలితముండదు. దైవమును నమ్మినవారే ఈ నోమును ఆచరించాలి. _________________________________________________________________________________

Comments

Popular posts from this blog

వినాయక వ్రతము

క్షీరాబ్ధి ద్వాదశి పూజ

నందికేశుడి నోము.