కన్నె తులసెమ్మ నోము.
కన్నె తులసెమ్మ నోము.
పూర్వము ఒకానొక ఊరిలో ఒక చిన్నది వుండేది. ఆమెకు సవతి తల్లి పోరు ఎక్కువగా వుండేది. అది భరించలేక ఆ చిన్నది తన అమ్మమ్మ గారి ఇంటికి వెల్లిపోయినది. సవతి తల్లి ఆ పిల్లను తీసుకు రమ్మని భర్తను వేదించేది. అందుకు అతడు అంగీకరించలేదు. ఒకనాడు సవతి తల్లి తన భర్తతో ఆ పిల్లను తీసుకు రమ్మని ఎంతగానో పట్టు పట్టింది. అప్పుడు ఆమె భర్త నువ్వే వెళ్లి తీసుకొని రమ్మన్నాడు. చేసేది లేక సవతి తల్లి ఆ చిన్న దాని తాతగారింటికి వెళ్ళింది. పిల్లను పంపించమని అడిగింది. వారు అంగీకరించలేదు. వారితో జగడమాడి ఆఖరికి ఎలాగైతేనేం వాళ్ళను ఒప్పించి ఆ చిన్న దానిని తన వెంట ఇంటికి తీసుక వచ్చింది.
ఒక రోజున ఆపిల్లకు తనపిల్లనిచ్చి ఎత్తుకోమని చెప్పి అరిసెముక్కను పెట్టి ఆమె తులసి పూజ చేసుకొనెను. చిన్నది తన సవతి తల్లి తులసి పూజ చేయడం చూసింది. తనకు కూడా ఆసక్తి కలిగి తన చేతిలో గల అరిసెముక్కను నైవేద్యం పెట్టి తులసి దేవిని పూజించింది. ఆమె భక్తికి మెచ్చి తులసి దేవి సాక్షాత్కరించి ఓ చిన్నదానా! గత జన్మలో నువ్వు కన్నె తులసి నోము నోచి ఉల్లంఘించి నందువల్ల నీకు తల్లి పోయి సవతి తల్లి కలిగింది. కనుక నువ్వు కన్నె తులసి నోము నోచుకోమన్నది. ఆ తులసీ దేవి చెప్పిన ప్రకారం ఆ చిన్నది కన్నె తులసి నోమును భక్తి శ్రద్దలతో నోచి సంవత్సరాంతమున ఉద్యాపన చేసుకున్నది. నాటి నుండి ఆ సవతి తల్లి ఆమె పట్ల ప్రేమానురాగాలు కలిగి ఎంతో ఆదరణతో సొంత బిడ్డలా చూసుకునేది.
ఉద్యాపన:
తులసమ్మకు పదమూడు జతల అరిసెలు నైవేద్యము పెట్టి పూజచేయ్యాలి. ఒక కన్యకు తలంటు నీళ్ళు పోసి పరికిణి, రవిక ఇచ్చి అరిసెలు వాయనమివ్వాలి.
________________________________________________________________________________
Comments
Post a Comment
thanking you comment visit our website
https://kbsastrology.com/