ఆపదలేని ఆదివారము నోము
ఆపదలేని ఆదివారము నోము
పూర్వకాలము నాటి మాట . ఆ కాలాన ఒక బ్రాహ్మణుడు .ఆయన ధనికుడు ,సిరి సంపదలకు లోటు లేదు. సంతానానికి లోటు లేదు. చాలా మంచివాడు. స్వపర బేధము లేకుండా అందరిని ఆదుకునేవాడు .ఎవరికీ ఏ ఆపద వచ్చినా ఆదుకునేవాడు .అందరికి అందుబాటులో ఉండేవాడు .మంచి మనిషిని మర్యాద గల బ్రాహ్మణుడని ప్రసిద్ది కెక్కాడు. మితిమీరిన దానాలు చేసేవాడు. ఎవరేమడిగితే అది ఇచ్చేవాడు. లేదన్నదే లేదు ఆయన నోట .కాలం గడుస్తోంది .కొంత కాలానికి అతడు పేద వాడయ్యాడు . సంపదలు హరించి పోయాయి .బాధలు ప్రారంభమయ్యాయి .సాయం అందినవారే ముఖం చాటేశారు. ఎవరూ ఆదుకోలేదు . అంతేకాదు కీడు తలపెట్టారు కూడా .ఇబ్బందుల పాలు చేశారు. మంచికి మన్నన ఉండదండి ,మర్యాద ఉండదు, మంచి వారికి వంచన తప్పటం లేదు. మోసం జరుగుతోంది ,కుట్రలు జరుగుతాయి .అయినా ఎన్ని బాధలైనా సహించగలరు. గాని మంచివారు మంచిగానే ఉండిపోతారు . గొడ్డలి దెబ్బలు తినే మంచి గంధపు చెట్టు సువాసనను గొడ్డలికి పంచుతుంది. బాధ తాననుభవిస్తూ కూడా .
పాపం ఒకనాడు అష్టైశ్వర్యాలతో తుల తూగిన ఆ బ్రాహ్మణుడు కడు పేద వాడయ్యాడు. అందుకు ఆయన బార్య కర్మ సాక్షి యగు సూర్య భగవానుని - ప్రభూ ! ఏమిటీ వింత ? నా భర్త పది మందికి పెట్టాడే గాని ఎవరి వద్ద ఏం తీసుకోలేదే . అటువంటి మాకు ఏమిటీ పరీక్ష ? ఎందుకీ దరిద్రం ? ఏమిటీ పేదరికం .మా లోపమేమిటి స్వామీ అని శోకించ సాగింది .అంత ఆమె అంతరాత్మ -అమ్మా ! విచారించకు ,బాధపడకు ,కష్టాలు కలకాలం ఉండవు. నీవు ఒక వ్రతం ఆచరించు. ఆ వ్రత మేమందువా ? "ఆపదలేని ఆదివారపు వ్రతం" . ఆ నోము నోచి చూడు .తప్పక నీకు మరల ఏ లోటు ఉండదు .అని ప్రభోదించి నట్లు అయినది. ఆ ఇల్లాలు ఆ విషయం భర్తకు వివరించి చెప్పినది . భర్త తప్పక ఆ వ్రతమాచరించ మని పలికాడు. అంతేకాదు అందుకు కావలసిన పదార్దములు సిద్దం చేయించాడు . ఆ ఇల్లాలు స్నానం చేసి శుచి అయి శుభ్రంగా చక్కర పొంగలి తయారు చేసి అరటి యాకు నందుంచి మంచి ఆవు నెయ్యి వేసి సూర్య భగవానునకు నైవేద్యము పెట్టినది .కన్నె ముత్తయిదువుకు వాయన మిచ్చినది . ఆ విధంగా క్రమం తప్పకుండా వరుసగా విధి విధానంగా 12 ఆదివారాలు వ్రతం జరిపినది .అనంతరం పదమూడవ ఆది వారాన 26 మంది ముత్తయిదువులకు పసుపు ,కుంకుమ ,రవికుల గుడ్డలు ,దక్షిణ ,తాంబూలములను ఇచ్చి ఒక ముత్తయిదువునకు వాయన మిచ్చి ఉన్నంతలో ,కలిగినంతలో అందరికి భోజనము పెట్టి సుఖంగా జీవించినది ఆఇల్లాలు .
ఉద్యాపన :
చక్కర పొంగలి తయారు చేసి అరటి యాకు నందుంచి మంచి ఆవు నెయ్యి వేసి సూర్య భగవానునకు నైవేద్యము పెట్టినది .కన్నె ముత్తయిదువుకు వాయన మిచ్చినది . ఆ విధంగా క్రమం తప్పకుండా వరుసగా విధి విధానంగా 12 ఆదివారాలు వ్రతం జరిపినది .అనంతరం పదమూడవ ఆది వారాన 26 మంది ముత్తయిదువులకు పసుపు ,కుంకుమ ,రవికుల గుడ్డలు ,దక్షిణ ,తాంబూలములను ఇచ్చి ఒక ముత్తయిదువునకు వాయన మిచ్చి ఉన్నంతలో ,కలిగినంతలో అందరికి భోజనము పెట్టవలెను.ఈ వ్రతమును శ్రద్దా భక్తులతో చేసిన పుణ్యము , ఇహమందు సుఖ సంతోషాలు ,పరమందు మోక్షము సిద్దిస్తాయి .ఇది ఋషులు చెప్పిన విషయం .త్రికాలభాద్యమాన మైన సత్యం ఆచరించి ఫలం పొందండి .
పాట
ఆదివార వ్రతం చేయండి ఆడవారందరూ !
ఆపదలు లేక హాయిగుండండి,
భక్తి శ్రద్దల తోడ మీరూ
శక్తితో అను రక్తితో
ఆదివార వ్రతం చేయండి ఆడవారందరూ !
ఆపదలు లేక హాయిగుండండి,
నోము నోచి ఫలముల నొంది
సుఖంగా మీరందరూ ఉండండి.!!!
సర్వేజనా సుఖినోభవంతు.
________________________________________________
Comments
Post a Comment
thanking you comment visit our website
https://kbsastrology.com/