ఉండ్రాళ్ళ తద్ది.

ఉండ్రాళ్ళ తద్ది. పూర్వకాలంనాటి మాట. ఒక ఊరిలో స్త్రీలందరు భాద్రపద బహుళ తదియనాడు ఉండరల్లా తద్దె నోముని నోచుకొనుచుండిరి. అప్పుడా ఊరి రాజుగారి వేశ్య నోము నోచుకొనెదనని రాజుతో చెప్పెను.రాజు " నీకు కావలసిన వస్తువులు ఏవో చెప్పు " అని అడిగెను. ఆ భోగమూడి చమత్కారముగా తనకు ఆకూ, గీకూ, పోకా, గీకా, కూరా, గీరా కావాలని చెప్పెను. అది ఎంతపని అని రాజు వాటిని తెచ్చుటకు నౌకరులను పంపెను. వరాన్నిటినీ తెచ్చిరి గానీ " గీ" అను పేరుతొ ఉన్నవాటిని తేలేకపోయిరి. ఆ సంగతి రాజు వేశ్యకు తెలుపగా, ఆమె నవ్వి " ఇంతేనా మీ రాచబడాయి " అని, అప్పటికే ప్రొద్దుపోవుటవుచే పక్క ఇంటి ముత్తయిదువును పిలచి, అయిదు ఉండ్రాళ్ళు గౌరికి నైవేద్యము పెట్టి అయిదు ఉండ్రాళ్ళను ఆ ముత్తయిదువునకు వాయనమిచ్చెను. ఆవిధంగా ఐదేళ్లు ఆమె ఆ నోము నోచుకుని ఉద్యాపన చేసుకొనెను. ఉద్యాపన : తదియ ముందునాడు తలంటి నీళ్లు పోసుకుని తదియన్తీ తెల్లవారుజామున భోజనము చేసి, నాటి సాయంకాలం వరకు ఎంగిలి పడకుండా ఉండి, చీకటిపడినంతనే గౌరికి అయిదు ఉండ్రాళ్ళు నైవేద్యము పెట్టి ఇంకొక అయిదు ఉండ్రాళ్ళు ముత్తయిదువునకు వాయనమీయవలెను. అట్లు అయిదు సంవత్సరములు చేసినపిమ్మట అయిదుగురు పుణ్యకాంతలకు తలంటి నీళ్లు పోసి గోరింటాకు ఇచ్చి, వారికీ ఒక్కక్కొరికీ అయిదేసి కుడుములు, రవికెలగుడ్డ, దక్షిణ తాంబూలములను ఇవ్వవలెను. కథలోపం వచ్చినను వ్రత లోపము రాకూడదు. >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

Comments

Popular posts from this blog

వినాయక వ్రతము

క్షీరాబ్ధి ద్వాదశి పూజ

నందికేశుడి నోము.