దంపతుల తాంబూలము నోము కథ

దంపతుల తాంబూలము నోము కథ ఒక భాగ్యశాలిని భర్త పెండ్లియైన కొన్ని నెలలకు వర్తకము చేయుటకై దేశాంతరములకు వెళ్లెను. ఆటను వెళ్లిన రెండు సంవత్సరములకు ఆమె ఆస్థి అంతయు దొంగలు దోచుకొనిపోయిరి. ఎంతకాలమునకు భర్త తిరిగి రాకపోవుటచేతను, ఉన్న ఆస్థి పోవుటచేతను ఆమె విసిగిపోయి అడవికి పోవుచుండెను.దారిలో ఆమె కెదురుగా పార్వతి పరమేశ్వరులు వృద్ధదంపతులవలె వచ్చి ఆమె విచారమునకు కారణం తెలుసుకుని , ''అమ్మా నీవు దంపతుల తాంబూలం నోము పట్టి ఉల్లంగించుటచే ఇట్టి కష్టములు వచ్చెను. కాబట్టి ఆ నోమును తిరిగి నోచుకోని సుఖంగా ఉండుము" అని చెప్పిరి. అదివిని ఆమె ఇంటికివచ్చి నోము నోచుకోని, కథ చెప్పుకొని అక్షతలు వేసుకొని ఏడాది అయినా తర్వాత ఉద్యాపన చేసుకొనెను. పిమ్మట ఆమెభర్త దేశాంతరముల నుండి వచ్చెను. వారంతట సుఖంగా ఉండిరి. ఉద్యాపన :- ఒక దంపతులకు సంవతసరం పాటు మగవారికి పండు పెట్టి తాంబూలం, ఆడవారికి పువ్వులు పెట్టి తాంబూలం ఇచ్చి అక్షింతలు వేయించుకోవాలి. సంవత్సరం అనంతరం దంపతులకు తలంటి నీళ్లు పోసి, భోజనం పెట్టి 108 ఆకులను, పోకలను తాంబూలపు వస్తువులను పళ్లెంలో పెట్టి ఇవ్వాలి.

Comments

Popular posts from this blog

వినాయక వ్రతము

క్షీరాబ్ధి ద్వాదశి పూజ

నందికేశుడి నోము.