అక్షయ బొండాల నోము
అక్షయ బొండాల నోము
పరమ పవిత్రమైన భారతదేశమునందు జన్మించిన స్త్రీలకు మన పూర్వులు చక్కని, పవిత్రమైన పుణ్య ప్రదమైన అత్యంత ఫలప్రదమైన అనేక నోములు వివరించి చెప్పారు. వృథా కాలక్షేపం చేయక స్త్రీలు వ్రతమాచరించి ఫలం అనుభవించండి. ఇది అక్ష్యయబొం డాల నోము వివరంగా వివరిస్తాను ఆచరించండి.ఫలం పొందండి.
అక్షయ బొండాలనోము
అక్షయ సంపద లిచ్చు నోము
అక్షయ బొండాల నోము
అక్షయ సంతతి నిచ్చునోము
అక్షయ బొండాల నోము
అక్షయ మాంగల్య మిచ్చు నోము
అక్షయ బొండాల నోము
అక్షయ మోక్షంబు నిచ్చు నోము
అక్షయ మోక్షంబు నిచ్చు నోము
అని అనుకొని పవిత్రాక్షతలు శిరసున దాల్చవలెను. ప్రతినిత్యం స్నానం చేసి ఒక సంవత్సరకాలం పసుపు ముద్దలు అయిదు, కుంకుడుకాయ పరిమాణంలో తయారుచేసికొని 5 గురు ముత్తయిదువులకు సమర్పించవలెను. అనంతరం దక్షిణ, తాంబూలం, రవికెలగుడ్డలు, పసుపు, కుంకుమ మంచి చక్కని బొండాలనూ వాయన మిచ్చుకొనవలెను. వివరాలు తెలిశాయి కదా! ఇక ఆలస్యం దేనికి ఆచరించండి, ఫలం పొందండి. ఈ అక్షయ బొండాలనోము వలన అక్షయ సంపద, సంతతి, అక్షయ మాంగల్యం, అక్షయ మోక్షం ప్రాప్తించును.
దైవం పై నమ్మకం లేనివారు, దేవతారాధన చేయనివారు ఈ వ్రతం చేయవద్దు, ఫలితముండదు.
విశ్వసించినవారికి ఈ విశ్వమందు అన్ని చేకూరతాయి.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
Comments
Post a Comment
thanking you comment visit our website
https://kbsastrology.com/