దశాసంవత్సరాలు
పరాశరుడు 27 నక్షత్రాలకు ఈ తొమ్మిది గ్రహాల్నిఅధిపతులుగా చెప్తూ వాటికి సంబంధించినదశాసంవత్సరాల్ని ఈ విధంగా కేటాయించాడు. అశ్విని, మఖ, మూలా నక్షత్రాలకు కేతువు అధిపతి. ఈ నక్షత్రాల్లో ఎవరు జన్మించినా వారి జన్మదశకేతుమహర్దశ అవుతుంది. భరణి, పుబ్బ, పూర్వాషాఢనక్షత్రాలకు శుక్రుడు అధిపతి. కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రాలకు రవి అధిపతి. రోహిణి, హస్త, శ్రవణంలకు చంద్రుడు అధిపతి. మృగశిర, చిత్త, ధనిష్టానక్షత్రాలకు కుజుడు అధిపతి. ఆరుద్ర, స్వాతి, శతభిషంలకు రాహువధిపతి. పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాలకు గురువు అధిపతి. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలకు శని అధిపతి. ఆశ్రేషా, జ్యేష్టా, రేవతి నక్షత్రాలకు బుధుడు అధిపతి. గ్రహాలకు చెప్పబడిన దశాసంవత్సరాలు రవి 6 సంవత్సరాలు చంద్రుడు 10 సంలు కుజుడు 7 సం.లుబుధుడు 17 సం.లు గురువు 16 సం.లు శుక్రుడు 20 సం.లు శని 19 సం.లు రాహువు 18 సం.లు కేతువు 7 సం.లు